- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kadapa: స్కిల్ కేసులో పిటిషన్ క్యాష్ అయితే కేసులన్నీ మటాషే..!
దిశ, కడప ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని విమర్శించే అర్హత విజయసాయిరెడ్డికి లేదని మాజీమంత్రి, బి.జె.పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పిటిషన్ క్వాష్ అయితే చంద్రబాబు నాయుడు కేసులన్నీ మటాష్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుకున్న మాట వాస్తవం కాదా అని, ఆయన తప్పు చేయలేదా అని ప్రశ్నించారు. రాష్ర్ట ప్రభుత్వం అప్పులు, తప్పులు చేస్తుంది వాస్తవమా కాదా అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాకి వైసీపీ నేతలే తెరలేపారని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీకి విజయసాయిరెడ్డి మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. బీజేపీ వైపు వైసీపీ ఉందా, లేదా అనేది చెప్పాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.
మాజీమంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్ భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి ముద్దాయిలు కాదా అని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. రాష్ర్టంలో ముఖ్యమంత్రి చేయని తప్పంటూ లేదన్నారు. అన్ని రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద మార్కెట్, ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్, నాయకులు చిల్లర మార్కెట్లు అని అభివర్ణించారు. ఎర్రచందనం ఇష్టానుసారంగా విక్రయించింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. డిస్లరీస్ కంపెనీలు అన్నీ వై.ఎస్.ఆర్.సి.పి కంట్రోల్‌లో నడుస్తున్నాయన్నారు. మద్యంలో భారీ స్థాయిలో దోపిడీ జరిగిందన్నారు. కేంద్రమంత్రులు నిర్మాలా సీతారామన్, అమిత్ షాకు నివేదిక ఇచ్చామన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో వచ్చిన నిధులు నాడు - నేడుతో దుర్వినియోగం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వట్లేదని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు.
విజయసాయిరెడ్డి రుషికొండపై అవినీతికి పాల్పడ్డారని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి ధనదాహానికి రైతులు బలి అవుతున్నారన్నారు. కడప కలెక్టర్ కూడా కె.సి కెనాల్‌లో నీళ్లు లేవని, వరి పంట వేయెద్దని ప్రకటన చేసినా కడప కరవు జగన్‌కి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. స్టిక్కర్ కింగ్, లిక్కర్ గింక్ ముఖ్యమంత్రి అని, కోడికత్తి కేసు పెద్ద డ్రామా అన్నారు. చంద్రబాబు బెయిల్ పై మాట్లాడితే టిడిపి వాళ్లు అని ఆపాదిస్తున్నారన్నారు. రాష్ర్టంలో బ్రిటీష్ పాలన కన్నా చాలా దరిద్రమైన పాలన కొనసాగుతోందన్నారు. కనికరం లేని కనకమహారాజు ముఖ్యమంత్రి అని ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.