Kadapa: ఇడుపులపాయ అటవీ ప్రాంతంలో చిరుతపులి కలకలం

by srinivas |   ( Updated:2023-09-24 13:15:18.0  )
Kadapa: ఇడుపులపాయ అటవీ ప్రాంతంలో చిరుతపులి కలకలం
X

దిశ, కడప: వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ సమీపంలో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. ట్రిపుల్ ఐటీ సమీపంలోని అడవి ప్రాంతంలో చిరుత పులి వెళ్లినట్లు హరిత రెస్టారెంట్ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాలసుబ్రమణ్యం తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలం వద్దకు వెళ్లి ఆరా తీశారు. అలాగే చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించి ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులకు పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో డ్యూటీ చేస్తున్న సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అలాగే సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాలసుబ్రమణ్యం సూచించారు.

Advertisement

Next Story

Most Viewed