చిన్నాన్న చివరి కోరిక కోసం బయలుదేరుతున్నా.. వైఎస్ షర్మిల భావోద్వేగ వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2024-04-05 13:10:43.0  )
చిన్నాన్న చివరి కోరిక కోసం బయలుదేరుతున్నా.. వైఎస్ షర్మిల భావోద్వేగ వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రచారం ప్రారంభించి ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను అభ్యర్థులను కూడా ప్రకటించాయి. తాజాగా ఎన్నికల ప్రచార బరిలోకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దిగుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు స్వయంగా షర్మిల ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘‘దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను.. మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story