ఇప్పుడున్నది రాజశేఖర్ రెడ్డి కొడుకే కానీ పాలనకాదు..అన్నపై చెల్లి ఫైర్

by Indraja |
ఇప్పుడున్నది రాజశేఖర్ రెడ్డి కొడుకే కానీ పాలనకాదు..అన్నపై చెల్లి ఫైర్
X

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ షర్మిల జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాలగోన్నారు. ఈ నేపధ్యంలో మాట్లాడిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇప్పటికీ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం తగ్గలేదని.. అందుకు ఆమెకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రజలందరు వైఎస్ రాజశేఖర్ రెడ్డిలానే ఆయన కొడుకు కూడా ప్రజల కోసం నిలబడతాడని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఆ నమ్మకాన్ని జగన్ రెడ్డి వమ్ము చేసాడని మండిపడ్డ ఆమె.. ఇప్పుడున్నది రాజశేఖర్ రెడ్డి కొడుకే.. కానీ, రాజేఖర రెడ్డి పాలన మాత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాజశేఖర్ రెడ్డి అనుక్షణం ప్రజల కోసమే తపించేవారని.. ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి చెయ్యని కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం.. ఆ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు.

అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి ఒక్క ఎంపీని కూడా గెలిపించలేదని.. అయిన ప్రభుత్వం మొత్తం బీజేపీ గుప్పెట్లో ఉందని పేర్కొన్నారు. ఇందుకు కారణం ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారడమే అని వెల్లడించారు. ఇక ఇప్పుడున్న అధికార ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని.. వైసీపీ ఎప్పుడో బీజేపీకి అమ్ముడు పోయిందని ఆరోపించారు. ఓట్లు ఎవరికీ వేసి గెలిపిస్తే రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అనే ప్రశ్న ప్రజలను అడగాల్సిందిగా నేతలకు సూచించారు. అధికార ప్రభుత్వం ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్ని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇక వైసీపీ, టీడీపీలు.. బీజేపీకి ఊడిగం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు షర్మిల.

Advertisement

Next Story