YCP ది 'పుష్ ఔట్.. పుష్ ఇన్' పాలసీ: Brahmani Nara ధ్వజం

by Seetharam |   ( Updated:2023-09-29 14:35:11.0  )
YCP ది పుష్ ఔట్.. పుష్ ఇన్ పాలసీ: Brahmani Nara ధ్వజం
X

డైనమిక్ బ్యూరో : రాజకీయాల్లో నారా బ్రాహ్మణి రోజు రోజుకు యాక్టివ్ అవుతున్నారు. వైసీపీని టార్గెట్ చేస్తూ ట్విటర్ వేదికగా ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా నారా బ్రాహ్మణి శుక్రవారం చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇతర రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోందని నారా బ్రాహ్మణి ట్విటర్ వేదికగా నిలదీశారు.స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లలో ఏపీని చంద్రబాబు అగ్ర స్థానంలో నిలిపిన విషయాన్ని నారా బ్రహ్మణి గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రప్రజలంతా గర్వపడేలా పాలన అందించారని బ్రాహ్మణి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ 'పుష్ ఔట్.. పుష్ ఇన్' పాలసీ కారణంగా అమరరాజా నుంచి లులూ వరకు సంస్థలన్నీ ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోయాయని నారా బ్రాహ్మణి విమర్శలు చేశారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ తీరుపై నేషనల్ మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని నారా బ్రాహ్మణి షేర్ చేశారు. ఇకపోతే స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేశ్‌ను ఏ-14 నిందితుడిగా సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నారా లోకేశ్‌ను త్వరలోనే సీఐడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో నారా బ్రాహ్మణిని టీడీపీలో కీలకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నారు. టీడీపీని లీడ్ చేసే దిశగా నారా బ్రాహ్మణి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏనాడూ పాలిటిక్స్‌ను పట్టించుకోని నారా బ్రాహ్మణి ఇటీవల కాలంలో అటు ట్విటర్ వేదికగానూ.. ఇటు పార్టీ నేతలతో కలిసినప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : TDP vs YCP.. సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్న ప్రభుత్వ కేసులు..!

Advertisement

Next Story

Most Viewed