- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి భారీ ఊరట.. హత్య కేసు కొట్టివేత
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి(YCP leader Baireddy Siddhartha Reddy)కి విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు(Vijayawada People Representatives Court)లో భారీ ఊరట లభించింది. సాయి ఈశ్వర్ అనే వ్యక్తి హత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ తాజాగా జరిగింది. అయితే ధర్మాసనం ఈ కేసును కొట్టి వేసింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు మరో 9 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
కాగా నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వర్ 2014లో దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు త్రి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు చికెన్ బాషా కాగా ఐదో నిందితుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బిగ్ రిలీఫ్ లభించింది.