- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్న వైసీపీ..నారా లోకేష్
దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు విజయనగరం జిల్లా రాజాంలో శంఖారావం బహిరంగ సభను నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం పార్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. జగన్ ఓ 420 అలానే సజ్జల 840 అని అని మండిపడ్డారు. ఇక 420 జగన్ కి 840 సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడని.. కాని ఒక్కటి పనికొచ్చే సలహా ఇవ్వరని ఎద్దేవ చేశారు.
ఇక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సలహా మేరకు వైసీపీ దొంగ ఓట్లతో గెలిచేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెలేల్సి ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలను టీడీపీ గెలిచిందని.. ఆ సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి అసలు వీళ్ళు మా ఓటర్లే కాదన్నారని.. అయితే ఆ సమయంలో ఆయనలా ఎందుకన్నారో అప్పుడు అర్ధం కాలేదు కానీ ఇప్పుడు అర్ధమవుతుందని.. దొంగ ఓట్లు ఎక్కించి రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.