- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ.. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు సీఎం జగన్ బిగ్ షాక్
దిశ, వెబ్ డెస్క్: పార్టీ లైన్ దాటిన ప్రజా ప్రతినిధులకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లేఖ రాసింది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆనం వెంకటరమణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సి.రామచంద్రయ్య క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో వారిని వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు వంశీకృష్ణయాదవ్‌తో పాటు సి. రామచంద్రయ్య ఆ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పారు.
కాగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశతో ఉన్న వారికి అధిష్టానం షాక్ ఇవ్వడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారిపై అనర్హత వేయాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం, మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేసింది.