ఉమ్మడి మేనిఫెస్టోపై సంచలన నిర్ణయం.. ఏం కావాలో ప్రజలకే వదిలేసిన కూటమి

by srinivas |   ( Updated:2024-04-08 13:02:19.0  )
ఉమ్మడి మేనిఫెస్టోపై సంచలన నిర్ణయం.. ఏం కావాలో ప్రజలకే వదిలేసిన కూటమి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికల జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి. అయితే ఎలాంటి పథకాలు పెట్టాలనే అంశాలపై ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో ఉమ్మడిగా ప్రజలకు ఏలాంటి పథకాలపై హామీ ఇవ్వాలనేదానిపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు వినూత్న ప్రయోగానికి తెరతీశారు.

అయితే ఏఏ పథకాలు, ఆంశాలు కావాలనే విషయాన్ని ప్రజలకే వదిలివేశారు. ‘మీరు అడగండి- మేం నెరవేరుస్తాం’ పేరుతో కూటమి మేనిఫెస్టోపై అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు వాట్సప్ నెంబర్‌ను విడుదల చేశారు. తమ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండాలనేదానిపై సలహాలు, సూచనలు, టెక్ట్స్ అండ్ వాయిస్ మెసేజ్‌, పీడీఎఫ్ లేదా వీడియోల రూపంలో 8341130393 నెంబర్‌కు వాట్సప్ చేయాలని ప్రజలను పిలుపునిచ్చారు. ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ఎన్డీయే కూటమి ఎజెండా అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed