- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేస్తా : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రకియ ప్రారంభమైన నేపథ్యంలో ఇన్నా్ళ్లు పార్టీ అధినేతలకు విధేయులుగా ఉన్న నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజు వైసీపీ ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతూ.. తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యాలు చేస్తున్నారు. నాలుగేళ్ల తరువాత రాష్ట్రానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ, జనసేన పార్టీల తరపునే పోటీకి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందని తెలిసినా.. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చానని అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం చేస్తూ.. రాజధానిపై అర్థం లేని నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. తనపై కేసులకు సంబంధించి వేసిన పిటీషన్‌పై జనవరి 25న సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని. తాను సీఎం జగన్‌తో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ రఘురామ వెల్లడించారు.