మరో మలుపు తిరిగిన ఏపీ రాజకీయం.. తన పేరే పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తుందా?

by Jakkula Mamatha |   ( Updated:2024-04-25 11:22:59.0  )
మరో మలుపు తిరిగిన ఏపీ రాజకీయం.. తన పేరే పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తుందా?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. అయితే అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం న్యూస్ సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారుతుంది. ఈ నేపథ్యంలో జనసేన అభిమానులకు మరో బిగ్ షాక్ తగిలింది. అది ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో రాజకీయం మరో మలుపు తిరిగింది.

పవన్ కళ్యాణ్ పేరుతో మూడు నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. కోనేటి పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ పేర్లతో ఉన్న ఓ పోస్టల్ బ్యాలేట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే నామినేషన్లు వేసిన వారి పేర్లు వారు ఎంచుకున్న గుర్తులు ఆధారంగా ఓ మోడల్ బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జనసైనికుల్లో టెన్షన్ నెలకొంది. అయితే ఈ వార్తలో వాస్తవం లేదని తెలిసింది. ఈసీ వెబ్‌సైట్ ప్రకారం పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ పేరుతో ఒక్కరే పోటీలో ఉన్నారని తెలింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 11మంది నామినేషన్ దాఖలు చేశారు.





Advertisement

Next Story

Most Viewed