- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YCP: టీడీపీ అభ్యర్థికి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎవరు..?
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు 5 స్థానాల్లో గెలిచారు. మరో స్థానంలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. అయితే క్రాస్ ఓటింగ్ వల్లే ఆమె విజయం సాధించినట్లు స్పష్టమైంది. తొలి నుంచి కూడా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు పక్కాగా టీడీపీకే పడతాయని భావించారు. అయితే అనూహ్యంగా మరో రెండు ఓట్లు టీడీపీకి పడటంతో వైసీపీకి భారీ నష్టం జరిగింది. ఏడు స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేతలకు క్రాస్ ఓటింగ్ షాక్ ఇచ్చింది. వైసీపీ నుంచి రెండు ఓట్లు అదనంగా టీడీపీకి పడటంతో గోడ దూకిన ఆ ఇద్దరు ఎవరనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా టీడీపీ చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మద్దాలగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, కరణం బలరాంలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. కానీ వైసీపీలో ఇటీవల అసంతృప్తులు స్వయంగా పార్టీ అధినేత జగన్‌పైనే విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు ఇటీవల తమ అసంతృప్తిని బహిరంగంగానే బయటపెట్టారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే టీడీపీకి ఎవరు ఓటు వేశారనేదానిపై ఆ పార్టీ నేతుల మల్లగుల్లాలు పడుతున్నారు. క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ అధినేత జగన్ నిఘా పెట్టినా కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ టచ్‌లోకి వెళ్లడంపై సర్వత్రా ఆశ్చర్యం కలుగుతోంది.
ఇక వైసీపీకి చెందిన ఐదుగురు అభ్యర్థుల్లో పోతుల సునీతకు 22 ఓట్లు, యేసురత్నం 22, ఇజ్రాయెల్ 22, పెనుమత్స సూర్యనారాయణరాజు 22, మర్రి రాజశేఖర్‌కు 22 ఓట్లు పోల్ అయ్యాయి. కోలా గురువులు, జయమంగళకు చెరో 21 ఓట్లు వచ్చాయి. వీరికి కేటాయించిన 44 మంది ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది.
Also Read...
Tdp Win: ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్.. నారా లోకేశ్ సెటైర్స్