ఆ రోజే టీ-టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-04 11:35:53.0  )
ఆ రోజే టీ-టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే నేడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేయాలనే ఆసక్తితో సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం ఈ నెల 7వ తేదీన (ఆదివారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సమావేశంలో టీ-టీడీపీ నూతన అధ్యక్షుడిగా నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed