- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలకొల్లులో దోపిడీ దొంగల బీభత్సం.. వృద్ధురాలి పరిస్థితి విషమం
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో చైన్ స్నాచర్లు, దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే మెడలో గొలుసులు తెంపుకుపోతున్నారు. అరిస్తే దాడులకు చేస్తున్నారు. వృద్ధులు అని కూడా చూడకుండా కొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా పాలకొల్లులో జరిగిన ఘటన స్థానికంగా భయబ్రాంతులకు గురి చేసింది. పాలకొల్లులో సోమవారం మధ్యాహ్నం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై రాళ్లతో దాడి చేశారు. మెడలో ఉన్న 10 కాసుల బంగారు గెలుసును లాక్కెళ్లారు. దొంగల దాడిలో గాయపడిన వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వృద్ధురాలి కుటంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. వృద్ధురాలి ఇంటి వద్ద సీసీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.