- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ap Womens Commission: మహిళపై అంత కర్కశత్వమా..?

దిశ,డైనమిక్ బ్యూరో: డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో మహిళను హతమార్చి గడ్డివాములో కాల్చేసిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాచవరం - పసలపూడి గ్రామాల మధ్య మండపేటలోని కాకినాడ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న పంటపొలాల గడ్డివాములో పూర్తిగా కాలిన మహిళ మృతదేహం వెలుగుచూసిన ఘటన సంచలనమైంది. ఘటన పట్ల కోస్తా జిల్లాల ఏరియా మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ బాబుతో ఆమె మాట్లాడి ఘటనపై ఆరాతీశారు. మహిళ పట్ల అంత కర్కశత్వానికి పాల్పడిన నేరగాళ్లను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని జయశ్రీరెడ్డి ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుతో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని.. ప్రత్యేకబృందాలతో విచారణను ముమ్మరం చేసినట్లు ఎస్పీ సుధీర్ రెడ్డి తెలిపారు. నేరస్తులను త్వరగా పట్టుకుంటామని తెలియజేశారు. కేసు సమగ్ర విచారణ జరిపి నివేదికను సమర్పిస్తామని మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీరెడ్డికి ఎస్పీ సుధీర్ రెడ్డి తెలియజేశారు.