Minister Kollu Ravindra: కల్తీ మద్యం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం

by Jakkula Mamatha |   ( Updated:2025-01-21 13:32:23.0  )
Minister Kollu Ravindra: కల్తీ మద్యం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం
X

దిశ,వెబ్‌డెస్క్: లక్షల మంది పోరాటం, వందల మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకున్నామని, అలాంటి పరిశ్రమను ఆదుకునేలా కేంద్రం రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కేవలం భూ దోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ భవనాలు ప్రధాని చేతుల మీద ప్రారంభించారు.

కూటమి ప్రభుత్వాని(AP Government)కి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని తెలిపారు. 99 శాతం భోగాపురం ఎయిర్ పోర్ట్(AirPort) ఎర్త్ పనులు పూర్తి అయ్యాయి. 37 శాతం రన్ వే పనులు జరిగాయి. దేశంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ ముందు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కల్తీ మద్యం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈనెల 29 నుంచి నవోదయం పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సీజ్ చేయడంతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తాం అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కల్లు, గీత కులవృత్తుదారులకు ప్రభుత్వం మద్యం దుకాణాలు కేటాయించింది. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 335 దుకాణాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలో 3396 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేసింది. ఇందులో పది శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించింది.



Next Story

Most Viewed