ఆ పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తాం..జగన్ రెడ్డికి కౌంట్‍డౌన్ షురూ: అచ్చెన్నాయుడు

by Seetharam |
ఆ పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తాం..జగన్ రెడ్డికి కౌంట్‍డౌన్ షురూ: అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : యువగళం శ్రేణులపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జగన్ రెడ్డి సైకో తర్వానికి అద్దం పడుతోంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ తీరు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. దమన కాండతో యువగళాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న విషేశమైన స్పందనను చూసి అక్రమ కేసులతో ఆటంకాలు సృష్టించడం వైసీపీ దిగజార్చుడు తనానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. లండన్‍ పర్యటనలో ఉన్నప్పటికీ జగన్ రెడ్డికి యువగళమే గుర్తుస్తోందని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రపై దాడి చేసిన వైసీపీ శ్రేణులను వదిలి.. టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. వైసీపీ నేతలు నరరూప రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు వైసీపీ నేతలకు సహకరిస్తూ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మారారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు విఘాతం కల్పిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తాం అని హెచ్చరించారు. రాజ్యహింసను ప్రేరేపిస్తూ అమాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజల కోసం పని చేసే టీడీపీ శ్రేణులపై జగన్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు స్వస్తి పలికే రోజు త్వరలోనే ఉంది అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story