- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారంలోకి రాగానే వాలంటీర్ల భవిష్యత్తును మారుస్తాం: చంద్రబాబు నాయుడు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దీంతో ప్రతిపక్షంలో టీడీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరుస మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. మంగళవారం జరిగిన ఓ సమావేశంలో.. బాబు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలోని వాలంటీర్ల జీవితాలను మార్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.
మా ప్రభుత్వం ఏర్పడగానే.. వాలంటీర్లు నెలకు రూ. 30 వేల నుంచి 50 వరకు సంపాదించే విధంగా కృషి చేస్తానని బాబు హామీ ఇచ్చారు. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు, ఐటీపీ అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జే బ్రాండ్ మద్యాన్ని అరికడతామని. రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టే బాధ్యతను తానే తీసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.