- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నాం: కోస్తాంధ్ర డీఐజీ రవికిరణ్
దిశ, బెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన భద్రత, ములాఖత్ విషయంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికి కారణం గత వారం మూడో ములాఖత్‌కు జైలు అధికారుల నుంచి అనుమతి రాలేదు. దీంతో కావాలనే చంద్రబాబు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు మూడో ములాఖత్ ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. మరోవైపు జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్లడం, ఆ స్థానంలో జైళ్లశాఖ కోసాంధ్ర డీఐజీ ఇంచార్జిగా రావడంతో చంద్రబాబు భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రాణ హాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో చంద్రబాబు భద్రతపై రాజమండ్రి సెంట్రల్ జైలు ఇంఛార్జి, జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ రవికిరణ్ స్పష్టత ఇచ్చారు. జైలులో చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత ఉందని తెలిపారు. నిబంధనలు, చట్టప్రకారమే తాము పని చేస్తున్నామని, కోర్టు గైలైన్స్‌ను పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ములాఖత్ వ్యవహారంలో నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. చంద్రబాబును కలిసేందుకు వారానికి రెండు ములాఖత్‌లు మాత్రమే ఉంటాయని చెప్పారు. అత్యవసరమైతే అధికారుల నిర్ణయంతో మూడో ములాఖత్ ఉంటుందని రవికిరణ్ పేర్కొన్నారు.