CM Chandrababu:బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లను ఆసక్తిగా తిలకించిన సీఎం

by Jakkula Mamatha |
CM Chandrababu:బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లను ఆసక్తిగా తిలకించిన సీఎం
X

దిశ ప్రతినిధి,విజయవాడ:విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తున్న సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ పై కాన్వాయ్ ఆపి కిందకు దిగారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి సీఎం చంద్రబాబు వారితో మాట్లాడారు. ఈ క్రమంలో కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందని సీఎం చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాల పై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story