‘సీజన్ ప్రారంభం కాబోతోంది.. నాణ్యమైన విత్తనాలు అందించండి’

by Jakkula Mamatha |
‘సీజన్ ప్రారంభం కాబోతోంది.. నాణ్యమైన విత్తనాలు అందించండి’
X

దిశ ప్రతినిధి,విజయవాడ: రైతులకు ఆర్‌బీకే ద్వారా నాణ్యమైన, నకిలీ లేని విత్తనాలను పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి ప్రారంభం కాబోతుందని చిన్న సన్నకారు రైతులు కోటి ఆశలతో దుక్కి దున్ని వ్యవసాయానికి అనుకూలంగా భూమిని రైతులు ఆరుగాలం కష్టపడి ఈ ఖరీఫ్ లోనైనా మంచి పంట పండించాలని ఆశిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా నకిలీ లేని నాణ్యమైన వరి, మిర్చి, పత్తి విత్తనాలను రైతులకు అందించాలని మార్కెట్లో ప్రైవేటు వ్యక్తులు నకిలీ విత్తనాలు రైతులకు ముట్ట చెప్పాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 5 లక్షలకు పెంచి రైతులను వచ్చే నూతన ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు. కొండూరు రైతులకు రావలసిన బాకీలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మద్ది రెడ్డి. వెంకటరెడ్డి, రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా నాయకులు గుంటుపల్లి వీరభద్రం, ఎస్ అలీబాబా, అలేటి విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed