నారా లోకేశ్ 'Yuvagalam' సక్సెస్ ఖాయం... ఎవరూ ఆపలేరు!

by srinivas |   ( Updated:2023-01-26 14:04:04.0  )
నారా లోకేశ్ Yuvagalam సక్సెస్ ఖాయం... ఎవరూ ఆపలేరు!
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్ర విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన ఏం మాట్లాడాలో లోకేశ్‌కు తెలుసన్నారు. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం వల్ల నష్టపోయిన అన్ని రంగాలపై నారా లోకేశ్ క్షుణ్ణంగా తెలుసుకున్నారని వాటి పరిష్కారమే పరమావధిగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాదయాత్ర ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా 'యువగళం' అనేది ప్రజల గళం, యువకుల గళం, రైతుల గళ, మహిళల గళం, బడుగు, బలహీన వర్గాల గళం అవ్వాలని సూచించారు. అప్పుడు యువగళం పాదయాత్రను ఎవడు ఆపుతాడో తాము చూస్తామంటూ చింతకాయల విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి: Pawan Kalyan‌పై బైరెడ్డి తీవ్ర ఆగ్రహం.. కొండారెడ్డి బురుజు దగ్గర కుస్తీకి రెడీ అంటూ సవాల్

Next Story