Minister Bosta: నీళ్లలో జగనన్న కాలనీలు.. వరదలు వస్తే సహజమేనంటూ వ్యాఖ్య

by srinivas |   ( Updated:2023-07-28 10:13:55.0  )
Minister Bosta: నీళ్లలో జగనన్న కాలనీలు.. వరదలు వస్తే సహజమేనంటూ వ్యాఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా చీపురుపల్లి అభివృద్ధిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం కంటే చీపురుపల్లి వంద రెట్లు అభివృద్ధి చెందిందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు చీపురుపల్లి అభివృద్ధిని చూడాలని బొత్స పిలుపునిచ్చారు. వర్షం దెబ్బకు ఉత్తరభారతం మొత్తం అల్లాడిపోతోందన్నారు. వరదలు వస్తే నీరు రావడం సహజమని.. అలాంటి జగనన్న కాలనీల్లో వస్తే రాజకీయం చేయడం సరికాదని సూచించారు. అశోక్ గజపతిరాజు మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు ఏం చేశారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. అమ్మఒడి కార్యక్రమానికి విద్యార్థులు వస్తే తప్పేంటని బొత్స ప్రశ్నించారు. విద్యార్థులు కాక సినిమా వాళ్లు వస్తారా అని నిలదీశారు. త్వరలో గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేయడంతో పాటు మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

Next Story