High Court: వివేకా హత్య కేసు విచారణ వాయిదా

by srinivas |
High Court: వివేకా హత్య కేసు విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case) విచారణ వాయిదా పడింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఏ3 నిందితుడు ఉమాశంకర్ రెడ్డి(Accused Umashankar Reddy) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ముందు వాదనలు కొనసాగాయి. ఉమా శంకర్ రెడ్డిని ప్రత్యక్ష సాక్షి గుర్తించలేదని, పొడవుగా, నల్లగా ఉన్నాడని చెప్పిన మాటల ఆధారంగానే ఈ కేసులో ఉమాశంకర్ రెడ్డిని నిందితుడిగా చేర్చారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిగా ఉమాశంకర్ రెడ్డిని గుర్తించామని సీబీఐ(CBI) తరపున కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed