Visakha తీరంలో ఇద్దరు గల్లంతు.. గాలింపు

by srinivas |   ( Updated:2023-02-19 16:44:04.0  )
Visakha తీరంలో ఇద్దరు గల్లంతు..  గాలింపు
X

దిశ, ఉత్తరాంధ్ర: శివరాత్రి జాగారం తరువాత సముద్ర తీరంలో పుణ్యం స్నానాలు ఆచరించిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు. ఎంవీపీ కాలనీకి సమీపంలో ఉన్న మూలపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి అనిల్, ఉమ్మడి ప్రవీణ్ సన్నిహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు ఈ క్రమంలో వేరు బోట్ షికారు చేశారు. వాసుపల్లి ప్రవీణ్( 20) సముద్ర మధ్యలో బోటు నుంచి దూకి ఈత కొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా అలలు లాక్కెళ్ళడంతో స్నేహితుడిని రక్షించాలని అనిల్ కూడా సముద్రంలోకి దూకాడు. అయితే ప్రవీణ్ భయంతో అనిల్ మెడను చుట్టుకున్నాడు. దాంతో ఇద్దరు ప్రమాదం బారిన పడ్డారు. బోటులో ఉన్న మిగతావారు కోస్ట్ గార్డు పోలీసులకు సమాచారం అందించినప్పటికీ అప్పటికే ఇరువురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిని గజ ఈత గాళ్లతో గాలిస్తున్నారు.

Advertisement

Next Story