- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: ఏపీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ప్రారంభం
దిశ, ఉత్తరాంధ్ర: ఈనెల 27వ తేదీ వరకు జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 పోటీలు విశాఖ ఏ.సి.ఏ-వి.డి.సి.ఏ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆరు టీములు ఈ పోటీల్లో తలపడనున్నాయి. భారత్ క్రికెట్ జట్టులో ఆడుతున్న భరత్, విహారి వంటి ప్లేయర్లు సైతం ఈ మ్యాచ్‌లో ఆడబోతున్నారు. ఏపీఎల్-2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటి శ్రీలీల ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ ఏపీఎల్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో స్థానం సంపాదించి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సీజన్-1 మంచి ఫలితాలు ఇచ్చిందని, పలువురు క్రీడాకారులు ఐపీఎల్‌లో స్థానం దక్కించుకున్నారని ఆయన తెలిపారు. భారత్ క్రికెట్ జట్టులో కీలక భూమికి పోషించిన అంబటి రాయుడు, భరత్ తదితరుల నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ రాష్ట్రంలోని మూడు స్టేడియంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధమైందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అక్టోబర్ 2 నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలను నిర్వహించనున్నారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. 40 రోజులు పాటు సాగే పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచే వారు మరింత ఉన్నత శిఖరాలు అందుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.