- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ ప్రభుత్వం చేసిన మోసాలు ప్రజలకు గుర్తున్నాయ్: వైవీ సుబ్బారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడపగడప విస్తృతంగా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంపై ఉత్తరాంధ్ర నాయకులతో ఆయన గురువారం విశాఖలో సమావేశమయ్యారు. ఐదేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధమని, మా ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితి కూటమి నేతలకు ఏర్పడిందని అన్నారు. సిద్ధం సభలు తర్వాత బహిరంగ సభ పెట్టుకునే ధైర్యం టీడీపీ జనసేన చేయలేకపోయారని అన్నారు.
ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వస్తే తప్ప ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితి టీడీపీ, జనసేన పార్టీలకు ఏర్పడిందని, వారాహి యాత్రను ఎన్నిసార్లు దించుతారు ఎన్నిసార్లు ఎత్తుతారంటూ ఎద్దేవా చేశారు. 2014-19 మధ్య ఎదురైన మోసాలు ఇప్పటికీ జనానికి గుర్తున్నాయని, కూటమి మరోసారి జనం ముందుకు వస్తోంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.సీఎం జగన్ పాలనలో జరిగిన మంచిని కూటమి చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ తదితరులు పాల్గొన్నారు.