ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చారు.. అమిత్ షాకు మంత్రి అమర్‌నాథ్ సూటి ప్రశ్న

by srinivas |   ( Updated:2023-06-12 14:51:59.0  )
ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చారు.. అమిత్ షాకు మంత్రి అమర్‌నాథ్ సూటి ప్రశ్న
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖకు వచ్చి పెద్ద సమస్యగా ఉన్న స్టీల్ ప్లాంట్ అంశం గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడలేదని బీజేపీని మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు. కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జేపీ నడ్డా, అమిత్ షా ఏపీకి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలతో బీజేపీ, వైసీపీ మధ్య చెలిమి లేదని అందరికి అర్ధమైందన్నారు. వైసీపీకి ఏ పార్టీపై ఆధారపడనవసరం లేదన్నారు. కేంద్రం ఎంతో దయతో రాష్ట్రానికి పథకాలు ఇస్తున్నట్లు అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం చెల్లించే పన్నుల వాటా నుంచే కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. పోలవరం విషయంలోనూ కేంద్రం సాయం చేయడం లేదని మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.

Also Read..

బీజేపీ విమర్శలకు సీఎం జగన్ కౌంటర్

Yv Subbareddy: ఆ మాట చెప్పకుండా 20 సీట్లు కావాలా.. అమిత్ షా!

Advertisement
Next Story

Most Viewed