- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anakapalli: టీడీపీలోకి భారీగా చేరికలు
దిశ, ఏపీ బ్యూరో: అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు యువనేత నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకున్నారు. జీవీఎంసీ 82వ వార్డులో గొలగం ఎంపీటీసీ, సర్పంచ్ చంద్రశేఖర్, అక్కిరెడ్డి వెంకటరమణ, పాడేరు నియోజకవర్గం లగిసపల్లికి సర్పంచ్ పార్వతమ్మ పార్టీలో చేరారు. వీరితో పాటు అనకాపల్లికి చెందిన పలువురు వార్డు మెంబర్లు, పాల సొసైటీ సభ్యులు కూడా ఉన్నారు.. వీరందరికీ నారా లోకేష్ టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, సర్పంచులను ఉత్సవ విగ్రహంలా ప్రభుత్వం మార్చిందని సర్పంచులు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం లోకేష్ మాట్లాడుతూ పంచాయతీలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని హామీనిచ్చారు. పంచాయతీల నిధులు గ్రామాల అభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికీ వెయ్యికోట్లకు పైగా పంచాయతీల ఖాతాల నుంచి విద్యుత్ బకాయిల పేరుతో లాక్కున్న జగన్ రెడ్డి ప్రభుత్వం...ఖాతాల్లో ఉన్న మరో రూ.250 కోట్లు కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని అధికమెజారిటీతో గెలిపించాలని లోకేష్ కోరారు.