- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: అనకాపల్లిలో దారి దోపిడీ.. 9 మంది అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: వాళ్లంతా ఉన్నత చదువులు చదివారు. చదవులనంతరం మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారనుకుంటే చెడు వ్యవసనాలకు అలవాటు పడ్డారు. కొంతకాలం సొంత డబ్బులతో జల్సాలు చేశారు. ఉద్యోగాలు లేకపోవడంతో డబ్బులు టైట్ అయ్యాయి. దీంతో దారి దోపిడీలను ఎంచుకున్నారు. ముఠాగా ఏర్పడి అనకాపల్లి పరిసరాల్లో దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. రోడ్డున పోయే వారిని బెదిరించి డబ్బులు, వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను గుంజుకుని అమ్ముకుంటున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అనకాపల్లి పరిసరాల్లో గట్టి నిఘా పెట్టి కేసును ఛేదించారు పోలీసులు.
దారి దోపిడీ కేసులో అనకాపల్లి పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితులు నలుగురిని బెదిరించి రూ.20 వేలు, సెల్ ఫోన్ అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులు గవరపాలెం వాసులుగా గుర్తించారు. వీరంతా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదవిన విద్యార్థులని పోలీసులు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలయ్యారని, దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.