- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: ఎంపీ భవంతి కోసం రోడ్డు మూసివేత.. ఉద్రిక్తత.. జనసైనికుల అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో ఎంపీ నిర్మిస్తున్న అతిపెద్ద భవంతికి వాస్తు దోషం ఉందని ప్రజలు నడిచే టైకూన్ కూడలిని మూసేశారు. దీంతో జనసేన వీర మహిళలు, నాయకులు ఆందోళన నిర్వహించారు. ఎంపీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జనసేన వీరమహిళలను ఈడ్చి కెళ్లి వ్యానుల్లో పడేశారు. అనంతరం విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీస్ అధికారులతో మాట్లాడారు. జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తు దోషం ఉంటే రోడ్డు మూసేస్తారా అని ప్రశ్నించారు. అధికారులు, పోలీసులను శాసిస్తున్న అదృశ్య వ్యక్తులెవరో బయటపెట్టాలని డిమాంద్ చేశారు. వినతి పత్రం నాటకమాడి.. ఆ తర్వాత ఒత్తిడి తెచ్చిందెవరు అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన వీర మహిళలు, నేతల్ని ఈడ్చిపడేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఉందన్నారు. విశాఖ భూ దందాపై వచ్చే ప్రభుత్వంలో సమగ్ర విచారణ చేయిస్తామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉంటే రోడ్డును మూసేస్తారా?
— JanaSena Party (@JanaSenaParty) December 9, 2023
• అధికారులు, పోలీసులను శాసిస్తున్న అదృశ్య వ్యక్తులెవరో బయటపెట్టాలి
• వినతి పత్రం నాటకమాడి.. తర్వాత ఒత్తిడి తెచ్చింది ఎవరు..?
• ప్రజా సమస్యపై పోరాతుడున్న జనసేన వీర మహిళలు, నేతల్ని ఈడ్చిపడేయమని ఎవరు… pic.twitter.com/BaFcO3itKi