- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు
దిశ, వెబ్‌డెస్క్: తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సోమవారం ఈ కేసు విచారణ చేపట్టిన రైల్వే కోర్టు తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసింది. ఈ తీర్పు వెలువరించే సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ముగ్గరు ఆర్పీఫ్ పోలీసులు విచారణ సరిగ్గా చేయలేదని పేర్కొంది. సున్నితమైన అంశాన్ని సాగదీశారని.. విచారణ సరిగ్గా చేయని పోలీస్ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకుడదో వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు జారీ చేసింది.
ఇక, కాపు రిజర్వేషన్ల కోసం 2016 జనవరి 30న కాపునాడు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించింది. ఈ సమయంలో కొందరు దుండగులు తుని రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్‌కు నిప్పటించారు. దీంతో రైల్వే పోలీసులు మొత్తం 41 మందిపై కేసు నమోదు చేశారు. కాపు ఉద్యమనేత ముద్రగడ, మంత్రి దాడిశెట్టి రాజా, నటుడు జీవీ సహా 41 మందిపై అప్పుడు రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 24 మంది సాక్షుల్లో 20 మందిని విచారించిన విజయవాడ రైల్వే కోర్టు.. ఇవాళ ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.