- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Vijayasai: దేశ భద్రతపై కేంద్రానికి విజయసాయి రెడ్డి కీలక రిక్వెస్ట్

దిశ, వెబ్ డెస్క్: అక్రమ వలసదారులు(Illegal Immigrants) భద్రతకు పెద్ద ముప్పు అని, దీనిపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) కోరారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన వైసీపీ నేత(YSRCP Leader) విజయసాయి రెడ్డి.. దేశ భద్రతపై(Country Security) ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. విజయసాయి రెడ్డి ట్వీట్ లో.. దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులు.. భద్రతకు పెద్ద ముప్పుగా మారడమే కాకుండా సామాజిక స్వరూపాన్ని కూడా దెబ్బతీస్తున్నారని, చాలా మంది వ్యక్తులు మారిన పేర్లతో జీవిస్తున్నారని అన్నారు. అలాగే కొందరు నేరాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితి దేశ శాంతి భద్రతలకు పెను సవాలుగా మారిందని, అటువంటి అక్రమ వలసదారులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు ప్రచారాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేగాక దేశప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడకూడదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.