- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైకోర్టులో బిగ్ షాక్.. ఆ ఖర్చులు మొత్తం వసూలు చేయాలని ఆదేశం

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి(Ycp former Leader Vijayasai Reddy daughter Nehareddy)కిహైకోర్టు(High Court)లో బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమునిపట్నం(Bhimunipatnam)లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు అయ్యే ఖర్చులను వసూలు చేయాలని జీవీఎంసీ అధికారుల(GVMC officials)కు ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు నేహారెడ్డి సంస్థలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అక్రమ నిర్మాణాలను సర్వే చేయాలని సూచించింది. తదుపరి విచారణకు పూర్తి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశించింది.
కాగా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి వైసీపీ హయాంలో విశాఖ(Visakha) జిల్లా భూమునిపట్నం సముద్ర తీర ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారు. అయితే అవి అక్రమమని, సీఆర్‌జెడ్ నిబంధనల(CRZ Rules)కు విరుద్ధంగా నిర్మించారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్(Jana Sena Corporator Pithala Murthy Yadav) హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు నేహారెడ్డి నిర్మాణాలను తొలగించారు. కానీ గోడలను తొలగించి కాంక్రీట్‌తో నిర్మించిన బేస్‌మెట్‌ను వదిలేశారు.
అయితే ఇసుకలో బేస్‌మేట్ నిర్మాణాలు అలానే ఉండటంపై తాజా విచారణలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని, ఆ ఖర్చులను నేహారెడ్డి కంపెనీ నుంచి వసూలు చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. అంతేకాదు కాంక్రీట్ నిర్మాణాలతో పర్యావరణానికి జరిగిన నష్టంపై కమిటీ వేయాలని కేంద్రపర్యావన మంత్రిత్వ శాఖకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.