- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థలం రెడీ.. 12 రోజుల్లో ఇచ్చేస్తాం: Mp Vijayasai Reddy
దిశ, ఏపీ బ్యూరో: పరిశ్రమలకు అనువైన పరిస్థితులు కల్పించడంలో జగన్ ప్రభుత్వం ముందుంటుందని ఏపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సువిశాల సముద్రతీరం, పుష్కలమైన వనరులు, నైపుణ్యత కల్గిన మానవ వనరులు, వ్యాపారులకు ప్రభుత్వ తోడ్పాటు తదితర అంశాలు పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు స్థలం మాత్రమే కాకుండా సగటున 12 రోజుల్లో అనుమతులు కూడా లభిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం 48 వేల ఎకరాలకు పైగా స్థలం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. వేసవిలో విద్యుత్ కొరత రాకూడదని, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంకావాలని ఇంధన శాఖ సమీక్షలో సీఎం జగన్ అధికారులను అదేశించారని విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే రైతులకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జాప్యం జరగకుడదని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3000 దేవాలయాలు అభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని, ఒక్కో దేవాలయం రూ.10 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.