Vidadala Rajini: వ్యక్తిత్వ హననం చేస్తూ నాపై పోస్టులు పెట్టారు

by Gantepaka Srikanth |
Vidadala Rajini: వ్యక్తిత్వ హననం చేస్తూ నాపై పోస్టులు పెట్టారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైసీపీ(YCP) కీలక నేత, మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు ఉంటున్నాయని ఆవేదన చెందారు. దీనిపై రాష్ట్ర డీజీపీ(AP DGP)కి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా(Social media) ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కాగా, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులతో పాటు జాతీయ మహిళా కమిషన్(National Commission for Women), ఏపీ మహిళా కమిషన్‌కు విడదల రజిని ఫిర్యాదు చేశారు. మహిళ, అందులోనూ ఒక మంత్రిగా పనిచేసిన తనపై దారుణమైన వీడియోలు, పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడదల రజిని ఇచ్చిన ఫిర్యాదును గుంటూరు పోలీసులు పరిశీలిస్తున్నారు.

Next Story

Most Viewed