- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పిఠాపురం వైపు వచ్చే వాహనాలు దారి మళ్లింపు.. కారణం ఏంటంటే?

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానంలో విజయకేతనం ఎగరేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి సారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ రేపు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమైంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ(Janasena Party)రేపు(మార్చి 14) 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకునేందుకు పిఠాపురం(Pitapuram) వేదిక కానుంది.
రేపు(శుక్రవారం) ఉదయం 11.00 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలు పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో SB Ventures వద్ద నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనేకమంది ప్రముఖులు హాజరుకానున్నారు. భద్రతా కారణాలతో పాటు ట్రాఫిక్ సౌకర్యార్థం ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేయబడినవి అని కాకినాడ జిల్లా ఎస్సీ తెలిపారు.
పార్కింగ్ ఏర్పాట్లు:
సభ ప్రాంగణానికి రానున్న వాహనాల కోసం చిత్రాడ గ్రామ పరిసరాలలో 9 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాకినాడ వైపు 5 పార్కింగ్ స్థలాలు మరియు పిఠాపురం వైపు 4 పార్కింగ్ స్థలాలు గుర్తించబడినవి.
చిత్రాడ పార్కింగ్ స్థలాలకు వెళ్ళే మార్గాలు:
*1 (a, b, c, d, e) లకు గుంటూరు జిల్లా, తెనాలి, కృష్ణా, పశ్చిమగోదావరి, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఉప్పలంక బైపాస్, చీడిగ గ్రామం, ఇంద్రపాలెం, కెనాల్ రోడ్డు, సామర్లకోట, 3 లైట్స్ జంక్షన్, ముత్త గోపాలకృష్ణ ఫ్లై ఓవర్ బ్రిడ్జి, సర్పవరం జంక్షన్, అచ్చంపేట జంక్షన్ మీదుగా చిత్రాడ సభ ప్రాంగణానికి చేరుకోవాలి.
* 2 (a, b, c, d) లకు ఉత్తర కోస్తా జిల్లాలు (విశాఖపట్నం, అనకాపల్లి, ASR) నుంచి వచ్చే వాహనాలు కత్తిపూడి, పిఠాపురం మీదుగా సభ ప్రాంగణానికి చేరుకోవాలి. EG జిల్లా, ఏలూరు జిల్లా, NTR జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ADB రోడ్, రాజానగరం, రంగంపేట, సామర్లకోట, పిఠాపురం మీదుగా సభ ప్రాంగణానికి చేరుకోవాలి.
ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు:
1. కాకినాడ, కోనసీమ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు కాకినాడ-ఇంద్రపాలెం వంతెన, కెనాల్ రోడ్డు, సామర్లకోట, కిర్లంపూడి, ప్రత్తిపాడు మీదుగా NH-16కు మళ్లించబడతాయి.
2.విశాఖపట్నం నుంచి కాకినాడ, కోనసీమ జిల్లాలకు వచ్చే వాహనాలు కత్తిపూడి నుంచి ప్రత్తిపాడు, కిర్లంపూడి, సామర్లకోట, కాకినాడ(కెనాల్ రోడ్డు) మీదుగా మళ్లించబడతాయి.
3.విశాఖపట్నం నుంచి కాకినాడ జిల్లా మీదుగా చెన్నై వెళ్లే వాహనాలు NH16 లో యధావిధిగా ప్రయాణించవచ్చు.
4.చెన్నై నుంచి కాకినాడ జిల్లా మీదుగా విశాఖపట్నం వెళ్లే వాహనాలు NH16లో యధావిధిగా ప్రయాణించవచ్చు.