- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Union Budget-2024: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మేరకు కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ సర్కార్ ఏర్పడేందుకు కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు ఈసారి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన నిధులపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే సహకారం రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని నింపే బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నానంటూ కొనియాడారు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి పథంలో మళ్లీ పరుగులు పెట్టబోతోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి కలిసే ముందుకు సాగుతుందని, ఆ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇప్పటికే స్పష్టతను ఇచ్చారంటూ గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడికి సభకు హాజరయ్యే దమ్ము, ధైర్యం లేదని.. అసులు ఐదేళ్లు మంచి చేసి ఉంటే కదా ధైర్యం ఉండేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి వారు ఏమీ చేయలేదు కాబట్టే అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి వెళ్లి రాజకీయం చేస్తున్నారంటూ చురకలంటించారు.
Read More..
AP:బడ్జెట్ నిధులతో ఎంతో ఊరట..హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు