- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
28 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. ఈవో కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (Tiruchanur Padmavati Kartika Brahmotsavam)జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు టీటీడీ ఈవో శ్యామలారావు(TTD Eo Shyamala Rao) ప్రత్యేకగా దృష్టి సారించారు. ఈ మేరకు అని విభాగాల అధికారులు సమన్వయంతో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు పసుపు మండలం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ఈవో పరిశీలించారు. చలువ పందిళ్లు, రంగోళీలు, క్యూ లైన్ల, బారికేడ్లు తదితర పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో పంచమ తీర్థం వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసులకు ఈవో సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణ, పీఏ సిస్టమ్, ఎల్ ఈడీ తెరలు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు చెప్పారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్(Hindu Dharma Prachar Parishad) ఆధ్వర్యంలో జరిగే కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. తిరుపతి మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరు అస్థాన మండపంలో జరిగే ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల భక్తులను ఆకట్టునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈవో శ్యామలారావు విజ్ఞప్తి చేశారు.