- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో హడలెత్తిస్తున్న చెడ్డీగ్యాంగ్ : తిరుపతిలో వరుస దోపిడీలు
దిశ, డైనమిక్ బ్యూరో : గతంలో ఏపీలో హడలెత్తించిన చెడ్డీ గ్యాంగ్ మళ్లీ రాష్ట్రంలోకి ఎంటరైంది. రాత్రిపూట వరుస దొంగతనాలకు పాల్పడుతూ దొంగతనాలు చేస్తూ అందర్నీ హడలెత్తిస్తోంది. తిరుపతి ఆ పరిసర ప్రాంతాల్లో ఈ చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతుంది. శుక్రవారం రాత్రి మారుతీ షోరూంలో ఈ చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. అలాగే శనివారం రాత్రి చెర్లోపల్లి వద్ద శ్రీవారి విల్లాస్‌లోని ప్లాట్ నంబర్ 31లో చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. ఈ మేరకు సీసీటీవీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్న వీడియోస్ రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఆధారంగా చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
పోలీసుల జాగ్రత్తలు
సీసీటీవీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు రికార్డు అయిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. చెడ్డీగ్యాంగ్ సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాత్రి సమయాల్లో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పగలంతా చెడ్డీ గ్యాంగ్ రెక్కీ నిర్వహించి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలియజేశారు.
మూడేళ్లుగా దోపిడీలు
ఇకపోతే రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ మూడేళ్లుగా సంచరిస్తోంది. 2021లో తిరుపతిలోని విద్యానగర్‌లో చోరీకి విఫలయత్నం చేసింది. అలాగే గతేడాది తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన కాలనీలో గోడదూకి ఓ ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. తాజాగా మళ్లీ వరుస దొంగతనాలకు పాల్పడుతూ హడలెత్తిస్తోంది చెడ్డీ గ్యాంగ్. ఈ గ్యాంగ్ దోపిడీలపై ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.