Ap: బీచ్‌లో కొడుకు మృతదేహం.. అల్లాడిపోయిన తల్లిదండ్రులు

by srinivas |   ( Updated:2025-02-09 14:04:43.0  )
Ap: బీచ్‌లో కొడుకు మృతదేహం.. అల్లాడిపోయిన తల్లిదండ్రులు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా రాంబిల్లి(Visakha District Rambilli)లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో ఇద్దరు యువకులు సరదాగా గడిపేందుకు బీచ్(Beach) వద్దకు వెళ్లారు. కొంతసేపటికి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. అలల(Waves) మధ్య కేరింతలు కొడుతున్న సమయంలో అనూహ్య ప్రమాదం జరిగింది. సముద్ర(Sea) కెరటం దెబ్బకు ఇద్దరు యువకులు ఒక్కసారిగా గల్లంతయ్యారు. అందరూ చూస్తుండగా యువకులను అల లాక్కెళ్లింది. దీంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. మెరైన్ పోలీసులు(Marine Police) వెంటనే సముద్రంలోకి వెళ్లి యువకులను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. సముద్రంలో గాలించి సూర్యతేజ మృతదేహాన్ని బయటకు తీశారు. మరో యువకుడు పవన్ తేజ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సూర్యతేజ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed