- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రంగంలోకి బీజేపీ అగ్రనేతలు..చంద్రబాబుతో కలిసి ప్రచారం

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 9న ఓటింగ్ జరగనుంది. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. దీంతో బీజేపీ అగ్రనేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దీంతో జిల్లా వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. అమిత్ షా ఏం హామీలిస్తారోనని ఎదురు చూస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా ధర్మవరంలో బీజేపీ ఆగ్రనేతలు పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అటు పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. అనంతపురం జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్.. రంగంలోకి సీఐడీ