- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Thirumala: లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు.. స్పందించిన సీఎం చంద్రబాబు
దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల లడ్డూ కల్తీ అంశంలో సుప్రీం కోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఇందులో చంద్రబాబు.. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. అలాగే కల్తీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలుపుతూ.. చివరగా సత్యమేవ జయతే.. ఓం నమో వెంకటేశాయా అని ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా లడ్డూ కల్తీ అంశంలో మాజీ న్యాయమూర్తితో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ అంశంలో విచారణ జరిపించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.