- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీ: చంద్రబాబు హామీల వర్షం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరో ఏడాది ముందుగానే మాజీ సీఎం చంద్రబాబు ఎన్నికల శంఖరావం పూరించారు. ఇందులో భాగంగా చంద్రబాబు వచ్చే ఎన్నికలకు సంబంధించి తొలి మ్యానిఫెస్టోని ఆదివారం విడుదల చేశారు. రాజమండ్రిలో టీడీపీ తలపెట్టిన మహానాడులో చంద్రబాబు ‘‘భవిష్యత్‌కు గ్యారెంటీ’’ పేరుతో టీడీపీ తొలి ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మ్యానిఫెస్టోలో చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా మహిళలే లక్ష్యంగా ఈ మ్యానిఫెస్టో రూపొందించారు.
మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం నిర్వహించడంతో పాటు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుందని.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని తెలిపారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. వీటితో పాటుగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు హామీల వర్షం కురిపించారు.
ఇవి కూడా చదవండి: