‘చంపేస్తాం’.. MLC దువ్వాడ శ్రీనివాస్‌కు బెదిరింపు కాల్స్ కలకలం

by Satheesh |   ( Updated:2024-07-16 13:31:21.0  )
‘చంపేస్తాం’.. MLC దువ్వాడ శ్రీనివాస్‌కు బెదిరింపు కాల్స్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని నెంబర్ నుండి ఫోన్ చేసిన దుండగులు తనను చంపేస్తామని బెదిరించారని ఎమ్మెల్సీ శ్రీనివాస్ టెక్కలి సీఐకి ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుల నుండి తనకు ప్రాణహాని ఉందని.. 4 ప్లస్ 4 గన్ మెన్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story