దేవాలయాలకు ర్యాంకులు.. టాప్‌‌లో ఉన్న ఆలయం ఇదే!

by Jakkula Mamatha |   ( Updated:2025-02-22 07:12:55.0  )
దేవాలయాలకు ర్యాంకులు.. టాప్‌‌లో ఉన్న ఆలయం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఆలయాలకు ర్యాంకులు ప్రకటించారు. రీసెంట్‌గా IVRS కాల్స్ ద్వారా భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఆంధ్రపదేశ్‌(Andhra Pradesh)లోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి(Kanipakam Temple) ఆలయానికి భక్తుల నుంచి మంచి మార్కులు వచ్చాయి. ఆలయాల గురించి భక్తుల్లో ఉన్న అభిప్రాయాలను ఏపీ ప్రభుత్వం(AP Government) ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా సేకరించింది.

అయితే జనవరి 20వ తేదీ నుంచి ప్రతి వారం సగటున 30,000 మంది భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని పలు వివరాలు వెల్లడించింది. భక్తుల(Devotees) నుంచి వసతులు, దర్శనం త్వరగా జరగడం, ప్రసాదం రుచి తదితర అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో ఆయా అంశాల్లో ప్రతి ప్రశ్నకు సంబంధించి ఆయా ఆలయాలకు వేర్వేరు ర్యాంకులు వచ్చాయి.

అందులో సేకరించిన వివరాల్లో మూడింటికి కలిపి చూస్తే కాణిపాకం ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శ్రీకాళహస్తి(Srikalahasti), మూడవ స్థానంలో ద్వారకా తిరుమల(Dwaraka Tirumala), ఆ తర్వాతి స్థానాల్లో విజయవాడ కనకదుర్గమ్మ(Vijayawada Kanaka Durgamma), సింహాచలం(Simhachalam), శ్రీశైలం(Srisailam), అన్నవరం(Annawaram) ఆలయాలు ఉన్నాయి. ఆ మూడు అంశాల్లో భక్తుల నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయం గురించి మంచి అభిప్రాయాలు రావడంతో ఆ ఆలయం అగ్రస్థానంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో దేవాలయాల్లో అందిన మౌలిక వసతులు, వాష్‌రూమ్స్, రవాణా వంటి తదితర అంశాలపై భక్తులను ప్రశ్నలు అడిగారు. ఈక్రమంలో భక్తుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఏడు ఆలయాల్లో కలిపి దర్శనాల సమయం పై 78 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆయా ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత, రుచి పై 84 శాతం మంది హర్షం వ్యక్తం చేశారు. అన్ని ఆలయాల సమాచారం ప్రకారం భక్తులు నుంచి సంతృప్తి స్థాయి 95 శాతం ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం(Government) సూచించింది.



Next Story

Most Viewed