- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics:నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసింది ఇదే..టీడీపీ సంచలన పోస్ట్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారని పలు పార్టీలు ప్రశ్నించడంతో దీనిపై తాజాగా టీడీపీ స్పందిస్తూ సంచలన పోస్ట్ పెట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో 30 కార్యక్రమాలు చేపట్టినట్లు టీడీపీ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. అధికారంలోకి రాగానే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారన్నారు. అలాగే పెన్షన్ల పెంచి ఇంటింటికి వెళ్లి పంచామని గుర్తు చేశారు. ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు, ఉచిత ఇసుక, రూ.70వేల కోట్లతో బీపీసీఎల్ పెట్టుబడి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి, విజయవాడ తూర్పు బైపాస్, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు విడుదల, తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పు అందజేత సహా మరికొన్ని కార్యక్రమాలకు బాటలు వేశామని పోస్ట్ చేసింది.