AP:తెలంగాణ సీఎంను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే..కారణం ఇదే!

by Jakkula Mamatha |
AP:తెలంగాణ సీఎంను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే..కారణం ఇదే!
X

దిశ ప్రతినిధి,అనంతపురం:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలిశారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్‌లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ 2024కు ఆయన హాజరయ్యారు. అదే కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే దగ్గుపాటి కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్‌కు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(KGF) అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్, తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కందుకూరు ఎమ్మెల్యే గుంటూరు నాగేశ్వరావు ఎమ్మెల్యే దగ్గుపాటిని కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ కమ్మ వారు ఏ రంగంలో ఉన్నా.. అక్కడ ఉన్నత శిఖరాలకు వెళ్లడంతో పాటు సేవా భావాన్ని మరువరన్నారు. పది మందికి సాయం చేయడం లేదా ఉపాధి కల్పించడం వంటివి కమ్మ సామాజిక వర్గం లో ఎక్కువగా ఉంటాయన్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వారు సొంత ప్రాంతం కోసం ఏదైనా చేయాలని దగ్గుపాటి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story