మళ్లీ జగనే రావాలంటున్నారు.. కానీ గుర్తు మాత్రం సైకిల్ అంటున్నారు: మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవేదన

by Seetharam |   ( Updated:2023-09-15 09:28:17.0  )
మళ్లీ జగనే రావాలంటున్నారు.. కానీ గుర్తు మాత్రం సైకిల్ అంటున్నారు: మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో : వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీనే గెలిపిస్తామని చెబుతున్నారని, కానీ చాలామంది మన గుర్తు ఏదంటే మాత్రం సైకిల్ అంటున్నారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని జ్యోతిబా పూలే కాలనీలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.... ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. మీరు ఓటు వేసి గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెప్పుకొచ్చారు. మీరు వద్దు అనుకుంటే ఇక దిగిపోవడమేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య, వితంతు పింఛన్ల వల్ల తాము హాయిగా ఉన్నామని చాలామంది చెప్తున్నారని...మళ్లీ జగన్‌ని గెలిపిస్తామనే అంటున్నారనీ చెప్పుకొచ్చారు. కానీ మన గుర్తు ఏదని అడిగితే మాత్రం సైకిల్ అంటున్నారని మంత్రి ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వల్ల లబ్ధిపొందిన ప్రతీ ఒక్కరూ జగన్ మళ్లీ రావాలనే కోరుకుంటున్నారని...నవరత్నాలను కొనసాగించాలనే యోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. కానీ గుర్తేంటో మాత్రం వారికి తెలియడం లేదని అన్నారు. కాబట్టే ఈ అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు. మన దగ్గర సరిపడా కరెంటు లేకపోవడంతో కోతలు విధించినట్టు చెప్పుకొచ్చారు. అందుకనే బయటి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story