- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: పుంగనూరులో టెన్షన్.. టెన్షన్
దిశ, వెబ్ డెస్క్: పుంగనూరు(Punganur)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి (Mp Mithun Reddy) పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ నేతలు (Tdp Leaders) అడ్డుకుంటారనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ కౌన్సిలర్లతో ఎంపీ మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలను తప్ప ఆ పార్టీ కార్యకర్తలను అనుమతించడం లేదు. ఈ మేరకు పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను సమావేశానికి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు.
కాగా పుంగనూరులో ఇటీవల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో వైసీపీ కార్యకర్తలతో భేటీ అయ్యేందుకు ఎంపీ మిథన్ రెడ్డి ప్లాన్ చేశారు. అయితే ఈ సమావేశాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పుంగనూరు నుంచి మిథున్ రెడ్డి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. రెడ్డప్ప ఇంటిపై రాళ్ల దాడి చేశారు. వైసీపీ నేతలకు సంబంధించిన వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు అదుపు చేశారు. ఎంపీ మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అప్పటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు తాజాగా పుంగనూరులో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో మిథున్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది.